Last Updated:

Air India Express Flights: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 86 విమానాలు రద్దు..

భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్‌ చేసి ప్రస్తుతం లేనిపోని ఇబ్బందులు పడుతోంది. సిబ్బంది కొరతతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు చివరి నిమిషంలోవిమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎయిర్‌ ఇండియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Air India Express Flights: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 86 విమానాలు రద్దు..

Air India Express Flights: భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్‌ చేసి ప్రస్తుతం లేనిపోని ఇబ్బందులు పడుతోంది. సిబ్బంది కొరతతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు చివరి నిమిషంలోవిమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎయిర్‌ ఇండియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎయిర్‌ ఇండియాను, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను టేకోవర్‌ చేసుకున్న తర్వాత ఆయా ఎయిర్‌లైన్సోలో పనిచేసిన సిబ్బందిని కూడా టాటా యాజమాన్యం తీసుకుంది. అయితే పైలెట్లు, కేబిన్‌ సిబ్బంది చెప్పేది ఏమిటంటే యాజమాన్యం తమతో విచక్షణ చూపిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ సిబ్బంది మొత్తం మూకుమ్మడి సెలవు తీసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం నాడు ఎయిర్‌ ఇండియా 86 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే యాజమాన్యం మాత్రం సాంకేతిక కారణాల వల్ల విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించినా.. వాస్తవం మాత్రం సిబ్బంది మూకుమ్మడి సిక్‌ లీవు తీసుకోవడమేనని తెలిసింది.

విలీనంతో క్యాబిన్ సిబ్బందికి కష్టాలు..(Air India Express Flights)

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ ఏషియా ఇండియాతో విలీనం చేసినప్పటి నుంచి ఎయిర్‌ ఇండియాలో పనిచేసే క్యాబిన్‌ సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌లో సుమారు 300 మంది సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. వారిలో చాలా మంది సీనియర్లు. కాగా వీరి ఆరోపణల విషయానికి వస్తే యాజమాన్యం తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తోంది. దీంతో ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతింటోందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికులు మాత్రం వేలాది రూపాయలు పెట్టి ఎప్పుడో నెల కింద టిక్కెట్లు కొనుగోలు చేస్తే చివరి నిమిషంలో విమాన సర్వీసులు రద్దు అయినట్లు మేసేజ్‌లు పంపడం ఏమిటని సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఆగ్రహావేశాలను చూసిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అపాలజీ చెబుతోంది. ఆపరేషనల్‌ రీజన్స్‌ వల్ల సర్వీసులను కేన్సల్‌ చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకుంది.

ఇక టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంలో స్థిరపడ్డానికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఇండియా కనెక్ట్‌ను విస్తారాను అన్నిటిని కలిపి ఎయిర్‌ ఇండియాలో విలీనం చేసింది. విలీనం తర్వాత యాజమాన్యం ఉద్యోగులను గౌరవంగా చూడటం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. విస్తారా పైలెట్లు విలీనం తర్వాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైలెట్లు, కేబిన్‌క్రూ వల్ల ఇటీవల కాలంలోసుమారు 150 విమాన సర్వీసులు రద్దు కావడమో లేదా ఆలస్యంగా నడవడమో జరిగింది. పైలెట్లు మూకుమ్మడి సిక్‌ లీవ్‌లు పెట్టడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇక యూనియన్‌ నాయకులు టాటా గ్రూపు చైర్మన్‌కు ఎన్‌ చంద్రశేఖరన్‌కు గత నెలలో లేఖ రాశారు. తమకు ఇచ్చే అలవెన్స్‌లు ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర అలెవెన్స్‌లపై కోత విధించారని, కంపెనీ లాభాలు ఆర్జించినా.. తమకు వచ్చే అలవెన్స్‌లను కోత విధించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. తమ బాధలను లేఖలో ప్రస్తావించారు.

హెచ్‌ఆర్‌ఏ కోతలు.. వేతనాల సమస్యలు..

ఇక అసలు విషయానికి వస్తే ఉద్యోగుల్లో హెచ్‌ఆర్‌ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్‌లో కోత విధించడం, అదే విధంగా పైలెట్లకు కొత్త వేతనం ఇస్తామని విస్తారా ఎయిర్‌ ఇండియాలో విలీనం సందర్భంగా ప్రకటించారు. నెలకు 40 గంటల ఫ్లయింగ్‌ హవర్స్‌కు గ్యారంటీగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. అంతకు ముందు ఇది 70 గంటలుగా ఉంది. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారు దీన్ని చూసి భయపడాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఫ్లయింగ్‌ హవర్స్‌ తగ్గిస్తే టేక్‌ హోం శాలరీ తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో విస్తారా యాజమాన్యం ఉద్యోగులు ఓ అల్టిమేటం జారీ చేసింది. తాము చెప్పిన కొత్త వేతన విధానానికి ఒప్పుకోవాల్సిందేనని పైలెట్లపై ఒత్తిడి పెంచింది. దీంతో పాటు విస్తారను ఎయిర్‌ ఇండియాతో విలీనం చేసిన తర్వాత మీకు విమానాలు నడిపే అవకాశం కోల్పోతారని హెచ్చరించింది. దీంతో పైలెట్లలో అభద్రతా భావం నెలకొంది. యాజమాన్యంపై ఆగ్రహంతో పైలెట్లు మూకుమ్మడి సిక్‌ లీవ్‌లు పెట్టడం మొదలుపెట్టారు.

పైలెట్లు మాత్రం తమ వేతనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిక్‌యూనిట్‌గా ఉన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్‌ చేసుకున్న తర్వాత లాభాలబాట పట్టినా.. తమకు ఇచ్చే అలవెన్స్‌లను క్రమంగా కోత విధించడంతో పాటు ఫ్లయింగ్‌ హవర్స్‌ తగ్గించడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదీ కాకుండా యాజమాన్యం పైలెట్లకు రోస్టరింగ్‌ ప్రాక్టీస్‌ అమలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీని వల్ల తమ వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌ తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంలో దిగి నంబర్‌ వన్‌ ఎయిర్‌లైన్‌గా మారాలనుకున్న సమయంలో ఇలా రోజు రోజుకు విమాన సర్వీసులు రద్దు చేసుకుంటూపోతే టాటాలకు ఉన్న పేరు ప్రతిష్టలు మసకబారిపోతాయనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.