Last Updated:

Minister Komati Reddy Venkata Reddy: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ .. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని..అంతా కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.

Minister Komati Reddy Venkata Reddy: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ .. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komati Reddy Venkata Reddy:లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని..అంతా కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. తాను సీఎం పదవి కోసం ఎప్పుడూ ఢిల్లీ వెళ్లలేదని..తాను క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నానని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తామంతా సంతోషంగా పనిచేసుకుంటున్నామన్నారు. మతరాజకీయాలతో బీజేపీ గెలవాలని చూస్తోందని..కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.మోదీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200కు పెరిగింది.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయని అన్నారు.రాముడి పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి మోదీ వచ్చారని ఎద్దేవా చేసారు.

కేసీఆర్ చచ్చిన పాము..(Minister Komati Reddy Venkata Reddy)

కేసీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్.. ఆయన చచ్చిన పామని మంత్రి అన్నారు. కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదన్నారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకూ అంతా అవినీతి చేశారన్నారు. కేసీఆర్ పాలనలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని, ఉద్యోగులకు ఒకటోతేదీ జీతాలు వచ్చేవి కావన్నారు. సీఆర్ కు దమ్ముంటే వాళ్లతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ పూర్తిగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసాని… తర్వాత మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం గది నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని… కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేకపోయామని ఎద్దేవా చేశారు.