Last Updated:

Producer T.G Viswa Prasad : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..

ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాంజలి తుది కన్నుమూశారని తెలుస్తుంది. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవలే బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

Producer T.G Viswa Prasad : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..

Producer T.G Viswa Prasad : ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాంజలి తుది కన్నుమూశారని తెలుస్తుంది. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవలే బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ఆమె చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలపడంతో ఆమె చివరి కోరిక మేరకు వారణాసి తీసుకెళ్లారు. అక్కడే శుక్రవారం సాయంత్రం ఆమె తుది శ్వాసవిడిచారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది.

అక్కడే దైవ దర్శనం అనంతరం.. ఆవిడ తుది శ్వాస విడిచారని అంటున్నారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు..  వారిలో విశ్వ ప్రసాద్ పెద్ద కొడుకు. అయితే వారణాసిలోనే ఆవిడ అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఇక ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసి పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి బ్యానర్ లో పలు సినిమాలు తెరకెక్కుతుండగా.. అందులో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వస్తున్న “బ్రో” మూవీ కూడా ఉంది.

ఇక ఆయన (Producer T.G Viswa Prasad) తల్లి మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి శివైక్యం చెందారని తెలిసి చింతిస్తున్నాను. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విశ్వ ప్రసాద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాసుకొచ్చారు.