Indonesian Open : ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చరిత్ర సృష్టించిన భారత్ జోడీ
ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ చరిత్ర సృష్టించింది. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అరొన్ చియా-సో వుయిక్ (మలేసియా) జోడీపై రెండు వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి విజయం సాధించారు. దీంతో ప్రతిష్ఠాత్మక ఇండోనేషియన్ ఓపెన్ లో
Indonesian Open : ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ చరిత్ర సృష్టించింది. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అరొన్ చియా-సో వుయిక్ (మలేసియా) జోడీపై రెండు వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి విజయం సాధించారు. దీంతో ప్రతిష్ఠాత్మక ఇండోనేషియన్ ఓపెన్ లో తొలిసారి డబుల్స్ కిరీటం సాధించిన భారత ద్వయంగా ఈ జంట రికార్డు సృష్టించారు.
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. తన కోచింగ్ కెరీర్లో ఇది అత్యంత సంతృప్తికరమైన క్షణాలలో ఒకటి అని చెప్పారు. ఇది గెలుపు కంటే అద్భుతమని.. మన ఆటగాళ్లు టోర్నమెంట్లో ఆడిన విధానం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ప్రపంచ నెంబర్ 1 జోడీని అంత సులభంగా ఓడించడం భారత బ్యాడ్మింటన్‌కు శుభసూచకమని అన్నారు. ‘‘మా టీమ్ అందరికి అభినందనలు’’ అని పుల్లెల గోపిచంద్ చెప్పారు.
అదే విధంగా ఏపీ సీఎం జగన్ కూడా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిని అభినందించారు. అద్వితీయ ప్రదర్శన కనబరిచి డబుల్స్ టైటిల్ గెలిచారంటూ ఏపీ షట్లర్ సాత్విక్, చిరాగ్ జోడీని అభినందించారు. సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తు లోనూ మరిన్ని టోర్నమెంట్లలో చాంపియన్లుగా నిలవాలని సీఎం జగన్ అభినందించారు.
CM Sri YS Jagan Mohan Reddy congratulated Satwikraj who hails from AP, and Chirag Shetty on winning the Indonesia Open Badminton 2023 doubles championship defeating world champion Malaysian duo in straight sets. The CM wished the pair many more wins in future tournaments.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 18, 2023