Last Updated:

OnePlus India: వన్ ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్ నక్రా రాజీనామా

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్‌ నక్రా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. నవనీత్ నక్రా రాజీనామాను వన్‌ప్లస్‌ కూడా ధ్రువీకరించింది.

OnePlus India: వన్ ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్ నక్రా రాజీనామా

OnePlus India: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్‌ నక్రా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. నవనీత్ నక్రా రాజీనామాను వన్‌ప్లస్‌ కూడా ధ్రువీకరించింది. నవనీత్.. అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటున్నాడని.. ఫ్యామిలీతో ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఇండియా రీజియన్‌పై ఫోకస్ (OnePlus India)

కాగా, 2020 నుంచి వన్ ప్లస్ ఇండియాలో నవనీత్ నక్రా వైస్ ప్రెసిడెంట్ గా, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ప్రయాణం మొదలుపెట్టారు. 2021లో వన్‌ప్లస్‌ ఇండియా సీఈఓగా నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌లో చేరక ముందు నవనీత్ యాపిల్‌ కంపెనీలో పనిచేశారు. మూడేళ్ల ప్రయాణంలో వన్‌ప్లస్‌ ఇండియా అభివృద్దికి నక్రా ఎంతో కృషి చేశారని వన్‌ప్లస్‌ ప్రకటనలో తెలిపింది.

ఆయన భవిష్యత్‌ ఆకాంక్షలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. అదే విధంగా ఇండియా రీజియన్‌పై ఇంతకు ముందులాగే వన్ ప్లస్ ఫోకస్‌ కొసాగుతుందని పేర్కొంది. నక్రా సీఈఓ గా ఉన్నపుడే వన్ ప్లస్ నార్డ్‌ సిరీస్‌లో మిడ్‌ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్లతో పాటు, ఇతర స్మార్ట్‌ డివైజ్లు దేశీయం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.