Last Updated:

IBPS RRB 2023: 8,612 పోస్టులతో ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. ధరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

ప్రతి ఏటా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో నియామకాల కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌’ పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023 కు సంబంధించిన నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది.

IBPS RRB 2023: 8,612 పోస్టులతో ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. ధరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

IBPS RRB 2023: ప్రతి ఏటా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో నియామకాల కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌’ పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023 కు సంబంధించిన నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 8,612 కు పైగా పోస్టులు ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో పీఓ, క్లర్క్‌, ఆఫీసర్స్‌ స్కేల్‌ 2,3 వ స్థాయి పోస్టులు ఉన్నాయి.

తుది గడువు జూన్‌ 21

IBPS కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఖాళీలను గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్ (స్కేల్‌ 1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టుల కింద డివైడ్ చేశారు. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లు ఉంటాయి. ఆన్‌లైన్‌ టెస్ట్‌ , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. జూన్‌ 1న ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి గడువు జూన్‌ 21తో ముగుస్తుంది.

 

నోటిఫికేషన్ వివరాలు..(IBPS RRB 2023)

జూన్ 1 తేదీ నుంచి 21 వత తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుంది.

జూన్ 10 వ తేదీ నుంచి ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

17 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) ఉంటుంది.

ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ఆగస్టు, 2023 లో ఉంటుంది.

ప్రిలిమ్స్‌ ఫలితాలను సెప్టెంబర్‌, 2023 లో వెల్లడిస్తారు.

మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ సెప్టెంబర్‌, 2023 లో ఉంటుంది.

మెయిల్స్‌ ఫలితాల అక్టోబర్‌, 2023 లో వెల్లడిస్తారు.

అక్టోబర్‌/నవంబర్‌, 2023 లలో ఇంటర్య్వూలు ఉంటాయి.

జనవరి, 2024 న ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ జరుగుతుంది.

పరీక్ష ఫీజు, పరీక్ష విధానం, ఖాళీల వివరాలు, జీతభత్యాలు, వయసు, దరఖాస్తు చేసుకునే విధానం, పోస్టును అనుసరించి కావాల్సిన అర్హతలకు నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు.

 

నోటిఫికేషన్ కోసం వివరాల ఇక్కడ క్లిక్‌ చేయండి.