Chhattisgarh: మొబైల్ ఫోన్ కోసం రిజర్వాయర్ నుంచి నీటిని తోడించిన ఛత్తీస్‌గఢ్ అధికారికి రూ.53,000 జరిమానా
తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు.
Chhattisgarh: తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు. సదరు సీనియర్ అధికారికి రూ.53,000 జరిమానా విధించారు.
సూపరింటెండెంట్ ఇంజనీరుకు నోటీసు..( Chhattisgarh)
మే 26న ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ నుండి సబ్ డివిజనల్ అధికారి ఆర్కె ధివర్‌కు వృథాగా పోతున్న నీటి ఖర్చును తన వేతనం నుండి ఎందుకు మినహాయించకూడదని ఆరా తీస్తూ లేఖ వచ్చింది. వేసవిలో సాగునీరు, ఇతర అవసరాలకు అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని లేఖలో ఉద్ఘాటించారు.కంకేర్ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌లో ఫుడ్ ఇనస్పెక్టర్ రాజేష్ విశ్వాస్ ఖేర్కట్ట డ్యామ్‌లోని పర్కోట్ రిజర్వాయర్‌లో సరదాగా సెలవుదినాన్ని గడుపుతూ స్నేహితులతో సెల్ఫీ తీసుకుంటుండగా న స్మార్ట్‌ఫోన్ నీటిలో పడిపోయింది. 96 వేలరూపాయల విలువైన తన ఫోన్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో 42 లక్షల లీటర్ల నీటిని రెండు శక్తివంతమైన డీజిల్ పంపులను ఉపయోగించి నాలుగు రోజుల పాటు తోడించాడు.
దీనికోసం అతను ఇరిగేషన్ అధికారిని రిజర్వాయర్‌లోని కొంత నీటిని సమీపంలోని కాలువలోకి పోయడానికి అనుమతిని కోరాడు. ఎక్కువ నీరు ఉన్నందున మూడు, నాలుగు అడుగుల మేర నీరు వదిలేస్తే ఇబ్బంది ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. కేవలం 5 అడుగుల వరకు మాత్రమే నీరు వెళ్లేందుకు అధికారి ఆమోదం తెలిపినా అంతకన్నా ఎక్కువ నీరు బయటకు పోయింది.