Rebel Star Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు నటుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.కృష్ణం రాజు తన కెరీర్‌లో 183 కంటే ఎక్కువ చలన చిత్రాలలో నటించారు. 1966లో కె. ప్రత్యగాత్మ నిర్మించి దర్శకత్వం వహించిన చిలకా గోరింక చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు.కృష్ణంరాజు ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు.
కృష్ణంరాజు జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994). వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ,
రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
A Legend Has left us… A man with a Heart of Gold.. Rest in Peace sir 🙏🏽🙏🏽🙏🏽 will miss your Presence and Motivational words always… @UVKrishnamRaju #KrishnamRaju 🙏🏽 pic.twitter.com/0a4bhAik0r
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2022