Former MP Anand Mohan Singh: నేను దోషినని ప్రభుత్వం భావిస్తే ఉరిశిక్షకు సిద్దం.. మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్
1994లో జరిగిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకేసులో తాను నిర్దోషినని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ అన్నారు. తాను దోషి అని ప్రభుత్వం భావిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Former MP Anand Mohan Singh: 1994లో జరిగిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకేసులో తాను నిర్దోషినని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ అన్నారు. తాను దోషి అని ప్రభుత్వం భావిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కృష్ణయ్య భార్యను బలిపశువు చేస్తున్నారు..(Former MP Anand Mohan Singh)
బీహార్‌లోని అరారియాలో జరిగిన ఒక బహిరంగ సభలో మోహన్ ప్రసంగిస్తూ ఈ దేశం ఎవరి సొత్తు కాదు. అందరూ రక్తం ధారపోసారు. నేను చట్టం మరియు రాజ్యాంగాన్ని నమ్ముతాను ఎటువంటి ఫిర్యాదు లేకుండా 15 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్షను అనుభవించాను.నేను దోషి అని ప్రభుత్వం విశ్వసిస్తే ఉరి శిక్షకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. హత్యకు గురైన కృష్ణయ్య భార్యను కొన్ని రాజకీయ పార్టీలు బలిపశువుగా చేస్తున్నాయని మోహన్ ఆరోపించారు.
నా బార్య సీబీఐ విచారణ కోరింది..
మోహన్ తన భార్య లవ్లీ సింగ్ అధికారి హత్యపై సిబిఐ విచారణను అభ్యర్థించారని కూడా పేర్కొన్నారు. నా భార్య ఎంపీగా ఉన్నప్పుడు జి. కృష్ణయ్య మృతి కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది. తన భర్త దోషి అయితే అతడిని ఉరి తీయండి అని ఆమె చెప్పిందని అన్నారు. ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ జి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మోహన్ 15 ఏళ్ల పాటు జైలులో ఉన్న సహర్సా జైలు నుంచి ఏప్రిల్ 27న విడుదలయ్యారు అతనితో సహా 27 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడానికి బీహార్ ప్రభుత్వం ఇటీవలి జైలు నిబంధనలను సవరించిన ఉపశమన ఉత్తర్వు కింద విడుదలయ్యారు.