Last Updated:

Kabul Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.

Kabul Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి

Afghanistan: ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు.

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు. రష్యా రాయబార కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. వీసాల కోసం దౌత్యకార్యాలయ గేట్ల వెలుపల ఎదురుచూస్తున్న సమయంలో పేలుడు జరిగింది. దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై తాలిబాన్ గార్డ్‌లు కాల్పులు జరిపారు. అయితే గార్డులు కాల్చిన వెంటనే తనను తాను పేల్చుకున్నాడు బాంబర్.

కాబూల్‌లోని ఓ మసీదులో ఈ నెల రెండున జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో 20 మంది మరణించారు. మృతుల్లో ప్రముఖ మత నాయకుడు ముజిబ్‌ ఉల్‌ రహమాన్‌ అన్సారీ కూడా ఉన్నారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హెరాత్‌ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి: