Kantara Movie : రిషబ్ శెట్టి “కాంతారా”కు అరుదైన గౌరవం.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో స్క్రీనింగ్
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది.
Kantara Movie : రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది. ప్రేక్షకులే కాఉండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై ప్రశంసలు వర్షం కురిపించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్ )లో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు హీరో రిషబ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అక్కడ సినిమా స్క్రీనింగ్ పూర్తైన అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్ర గురించి రిషబ్ మాట్లాడనున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంపై రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసారు.
ఐరాసలో ప్రదర్శితమయ్యే తొలి కన్నడ సినిమాగా “కాంతారా” (Kantara Movie) రికార్డు..
మార్చి 17న 6 గంటలకు జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో పాథే బాలెక్సర్ట్ థియేటర్ లోని హాల్ నంబర్ 13లో ఈ సినిమా స్క్రినింగ్ కానుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో .. “పలు భారతీయ చిత్రాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయి. నా సినిమా కాంతారలోనూ ఆ అంశాన్ని ప్రస్తావించాం. ప్రకృతితో మనకున్న కనెక్షన్ ఏంటో ఈ చిత్రం తెలియజేస్తుంది. ఇలాంటి సినిమాలు ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్ లు స్వీకరించి సంబంధిత సమస్యలను పరిష్కరించగల స్పూర్తినిస్తాయి” అంటూ చెప్పుకొచ్చారు. కాగా చిన్న సినిమాగా వచ్చి ఇంతటి అరుదైన ఘనతని కాంతారా సినిమా సాధించడం పట్ల పలువురు ప్రముఖులు మూవీ యూనిట్ ని అభినందిస్తున్నారు.
Indian cinema: environment and engagement https://t.co/rppdl05CgQ #indiancinema #ElephantWhisperer pic.twitter.com/HCPRtFnmYn
— India World View (@IndiaWorldView1) March 16, 2023
ఇక ఐరాసలో ప్రదర్శితమయ్యే తొలి కన్నడ సినిమాగా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది కాంతారా. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాంతార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంతార సీక్వెల్ పై హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఇప్పుడు వచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చెయ్యబోతున్నాము అని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మీరు చూసింది కాంతార 2. త్వరలో కాంతార 1 తీస్తాను అని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిపాడు. దీంతో అంతా కాంతార సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Telangana Mlc Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఊహించని షాక్.. బీజేపీ అభ్యర్థి విజయం
- CM Ys Jagan : డిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ
- Secunderabad Fire Accident : సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. 6 మృతి.. మృతులంతా 25 ఏళ్ల లోపు వారే