Preeti Case: డాక్టర్ ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు..
Preeti Case: డాక్టర్ ప్రీతి మృతి కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసు వరంగల్ పోలీసులకు చిక్కుముడిగా మారింది. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికి కీలక విషయాలు బయటకి రావడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ తో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Preeti Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రీతి ఆత్మహత్య కేసులో ఇప్పటికి నిజనిజాలు బయటకి రావడం లేదు. పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతునే ఉంది. అయితే ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి శరీరంలో విష రసాయనాల ఆనవాళ్లు లేవని వెల్లడైంది.
సవాల్ గా మారిన కేసు.. (Preeti Case)
డాక్టర్ ప్రీతి మృతి కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసు వరంగల్ పోలీసులకు చిక్కుముడిగా మారింది. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికి కీలక విషయాలు బయటకి రావడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ తో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఇటు కాకతీయ మెడికల్ యాజమాన్యం, అటు పోలీసులు మొదటి నుంచి చెబుతూవస్తున్నారు. అయితే టాక్సికాలజీ రిపోర్టులో మాత్రం ప్రీతి శరీరంలో అసలు విష పదార్థాలే డిటెక్ట్ కాలేదని తేలినట్లు సమాచారం.
ప్రీతి శరీరంలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని ఆ రిపోర్టులో వెల్లడైనట్లు సమాచారం. గుండె, కాలేయం, రక్తంతోపాటు పలు అవయవాళ్లో విష పదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. టాక్సీకాలజీ రిపోర్టు వరంగల్ సీపీ రంగనాథ్ కు చేరింది. ప్రీతి బాడీలో విష పదార్ధాలే లేనప్పుడు మరి ఆమె ఎలా చనిపోయారన్నది తెలియాల్సివుంది. దీంతో ప్రీతి హత్యా? ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా వచ్చిన రిపోర్టుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి ఆర్గాన్స్ పై విష ప్రభావం లేదనే విషయం ఇప్పుడు పోలీసులను సందిగ్ధంలో పడేసింది. సూసైడ్ కేసును అనుమానాస్పద కేసుగా మార్చే పనిలో పోలీసులు ఉన్నారు. అనస్తీషియా డిపార్ట్ మెంట్ హెచ్ వోడీ వ్యవహారంపై పోలీసులు సతమతమవుతున్నారు. ప్రీతి కేసులో సంచలన విషయం బయటకు రావడంతో వరంగల్ సీపీ హైదరాబాద్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే డీజీపీ అంజనీ కుమార్ సీపీకి ఫోన్ చేసి, ప్రీతి కేసుపై ఆరా తీశారు. ప్రీతి కేసులో ఏవీ.రంగనాథ్ ను డీజీపీ పిలవడంతో ఉత్కంఠ నెలకొంది.
ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్య..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది. నిమ్స్ లో ఐదు రోజుల చికిత్స అనంతరం మెడికో విద్యార్ధిని మృతిచెందింది. ఈ ఆత్మహత్యపై ప్రీతి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఆత్మాహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిజనిజాలు తెలుస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన సైఫ్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.