Ram Mandir: రామమందిరంపై ఉగ్రదాడి సమాచారంతో అప్రమత్తమయిన నిఘా సంస్దలు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో
Ram Mandir: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో
నిఘా వర్గాలు అప్రమత్తమై ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
నివేదికల ప్రకారం ఉగ్రదాడికి పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్లాన్ చేస్తోంది.
పాక్ నుంచి నేపాల్ మీదుగా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలకు సమాచారం అందింది.
రాబోయే రోజుల్లో రామమందిరంపై దాడి జరగబోతోందన్న సమాచారంతో భారతదేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
పాక్ నుంచి నేపాల్ మీదుగా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తాయి.
ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు..
అయోధ్యలోని రామ మందిరంపై ‘ఫిదాయీన్’ దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. ఫిదాయీన్ దాడి చేసేవారు సాధారణంగా ఆత్మాహుతి బాంబర్లు. వారు బాంబు పేల్చడానికి తమను తాము పేల్చుకుంటారు.
రామమందిరంపై దాడితో హిందూ-ముస్లింల మధ్య విభేదాలను రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అయోధ్యలో రామమందిరం(Ram Mandir)పై దాడి వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఉందని కూడా నిఘావర్గాల సమాచారం.
సరిహద్దు వెంబడి భారత సాయుధ దళాల నిరంతర నిఘా, పాక్ ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంతో పాక్ సైన్యం నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చొరబాటు సొరంగాలను గుర్తించి మూసివేశామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా అరికట్టామని సరిహద్దు భద్రతాదళాలు తెలిపాయి.
మరోవైపు ఇటీవల కాలంలో పాక్ సైన్యం, తాలిబన్ల మధ్య ఘర్షణలు పెరిగాయి. పాకిస్తాన్ లో ఆర్దిక సంక్షోభం తీవ్రంగా ఉంది.
ఈ నేపధ్యంలో పాక్ పాలకులు తమ దృష్టిని భారత్ వైపు కేంద్రీకరించారని తెలుస్తోంది.
మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం మరియు మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాలని ఐఎస్ఐ భావిస్తోంది.
భారత ప్రభుత్వానికి మరియు భారత సాయుధ దళాలకు వ్యతిరేకంగా లోయలో వేర్పాటువాద భావాలను రెచ్చగొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2024 జనవరికి గర్బగుడి ..
జనవరి 2024 నాటికి అయోధ్యలో శ్రీరామ మందిరం యొక్క గ్రౌండ్ మరియు మొదటి అంతస్తుల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది మకర సంక్రాంతి పండుగ నాటికి గర్భగుడి (గర్భ గృహం) మూర్తిని ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త రామమందిరంలో ప్రస్తుతం ఉన్న మూర్తితో పాటు మరో పెద్ద మూర్తిని ప్రతిష్ఠించనున్నారు.
వాస్తుశిల్పులు గర్భ గృహం లోపల ఉదయించే సూర్యుని కిరణాలు భగవంతుడు శ్రీరాముని నుదిటిపై పడే విధంగా ఆలయాన్ని ప్లాన్ చేశారు.
ఆలయ పునాదులను బలోపేతం చేయడానికి చుట్టూ ఐదు అడుగుల గ్రానైట్ రాళ్లను ఏర్పాటు చేశారు.
గర్భగుడి కింది అంతస్తులో 170 స్తంభాలు ఉంటాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి 2024లో శ్రీరామ మందిర గర్భ గృహ ప్రారంభోత్సవం జరిగే అవకాశముందని సమాచారం.