Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో నా ఫోటో వద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞప్తి.. ఏ రాష్ట్రంలోనంటే?
కాంగ్రెస్ కు అనూహ్య మైలేజ్ తెప్పిస్తున్న భారత్ జోడో యాత్రలో తన ఫోటో ముద్రించవద్దంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్రాసిన లెటరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
Madhya Pradesh: కాంగ్రెస్ కు అనూహ్య మైలేజ్ తెప్పిస్తున్న భారత్ జోడో యాత్రలో తన ఫోటో ముద్రించవద్దంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్రాసిన లెటరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయం సింగ్ మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర పర్యటన సమయంలో తన ఫోటోలను ఎక్కడా ముద్రించవద్దంటూ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కమల్ నాధ్ కు ఆయన లేఖ వ్రాశారు. పబ్లిసిటీ మెటీరియల్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, కమల్నాథ్ల ఫొటోలను మాత్రమే ఉపయోగించాలని ఆయన అన్నారు.
అక్టోబర్ 22న రాసిన ఈ లేఖ రెండు రోజుల క్రితమే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ప్రారంభించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ సింగ్ పార్టీకి మంచి మైలేజ్ తెప్పించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం పై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఏఐసిసి తగిన జాగ్రత్తలు తీసుకోంటోంది.
ఇది కూడా చదవండి: Jn NTR: బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్..ట్రెండింగ్ లో ఫోటోలు