Raja singh: రాజాసింగ్ పీడీ యాక్ట్ పై హైకోర్టులో నేడు విచారణ
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Raja singh: మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే పీడీ యాక్ట్ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దాదాపు రెండు నెలల నుంచి గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు. కాగా మరోవైపు రాజాసింగ్ పీడీయాక్ట్‌ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టనుంది.
ఇదిలా ఉండగా రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని అతని భార్య ఉషాబాయి గతంలో బోర్డుకు వినతిపత్రం సమర్పించిన సంగతి విదితమే. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ భాస్కర్ రావు, మరో ఇద్దరు జడ్జీల సమక్షంలో దీనిపై విచారణ చేపట్టారు. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి దారితీసిన పరిస్థితులను పోలీసులకు బోర్డుకు వివరించారు. అలాగే రాజాసింగ్ పై వందల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2004 నుంచి ఇప్పటి వరకు రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయని.. వాటిలో 18 కేసులు కేవలం మతపరమైన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవేనని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరుగనున్న చార్జీలు