Rishad Premji: కీలక ఉద్యోగులనే తొలగించాం.. కంపెనీకి నిబంధనలే ముఖ్యం.. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి ఉద్యోగులనైనా ఉపేక్షించేది లేదని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. బెంగళూరులో నేడు జరిగిన ఓ సెమినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bangalore: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి ఉద్యోగులనైనా ఉపేక్షించేది లేదని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. బెంగళూరులో నేడు జరిగిన ఓ సెమినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ నియమ నిబంధనల్ని ప్రతి ఉద్యోగి పాటించాలన్నారు. సంస్ధలో పనిచేసిన ఓ కీలక వ్యక్తిని 10 నిమిషాల్లో ఉద్వాసన పలికామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలగించిన వ్యక్తి, కంపెనీలోని కీలక 20మంది ఉద్యోగుల్లో ఒకరుగా ప్రేమ్ జీ తెలిపారు. అయితే అతని పేరును ఆయన వెల్లడించలేదు.
మూన్ లైటింగ్ విధానంలో విప్రో యాజమాన్యం 300 మంది ఉద్యోగులను తొలగించివుంది. ఈ క్రమంలో ప్రేమ్ జీ పేర్కొన్న కీలక వ్యక్తిని కూడా ఆ కోవలోనే తొలగించివుంటారని సమావేశానికి వచ్చిన ప్రతినిధులు చర్చించుకొన్నారు. మొత్తం మీద పలు ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను మూని లైటింగ్ విధానం వైపు చూపులు మరల్చకుండా పలు జాగ్రత్తలు తీసుకొంటుందని విప్రో అధినేత మాటలతో తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Infosys: హైబ్రిడ్ పని విధానం వైపే ఇన్ఫోసిస్ మొగ్గు.. ప్రకటించిన యాజమాన్యం