Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన భారత రెజ్లర్లు..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా, అన్షు (57 కేజీలు) రజతం దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లర్లు దీపక్ పునియా, దివ్య కక్రాన్, మోహిత్ గ్రేవాల్లు విజేతలుగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ద్రౌపది ముర్ము వారిపై ప్రశంసలు కురిపించారు. మన రెజ్లర్లు అద్బుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పతకాల పట్టికలో మోహిత్ గ్రేవాల్ కూడా చేరాడు. అతనికి అభినందనలు. రాబోయే కాలంలో అతను విజయాల కొత్త శిఖరాలను అధిరోహిస్తాడని నేను ఆశిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.
#కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచినందుకు మా యువ రెజ్లర్ దీపక్ పునియాకు అభినందనలు. మీ విశ్వాసం మరియు సానుకూల దృక్పథం చూడటానికి ఆకట్టుకునేలా ఉన్నాయి. మీరు భారతదేశానికి గొప్ప ఆనందాన్ని మరియు కీర్తిని తెచ్చారు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేసారు.