John Cena: చరత్ర సృష్టించిన జాన్ సీనా.. రిక్ ఫ్లెర్ రికార్డు బద్దలు

John Cena’s 17th WWE World Championship: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా చరిత్ర సృష్టించారు. అత్యధిక సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గాడు. ఈ మేరకు జాన్ సీనా 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైలిట్స్ నెగ్గి ప్రోఫెషనల్ రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. అయితే అంతకుముందు ఈ ఘనత రిక్ ప్లేర్ పేరిట ఉండేది. ఆయన 16 టైటిల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా, జరిగిన ‘రెసిల్ మేనియా 41’ ఈవెంట్‌లో కొడీ రోడ్స్‌ను జాన్ సీనా ఓడించాడు. ఈ విజయంతో తన ఖాతాలో 17వ టైటిల్ పడింది. దీంతో అంతకుముందు రిక్ ఫ్లైర్ పేరిట ఉన్న రికార్డును జాన్ సీన్ బద్దలు కొట్టాడు. అయితే డబ్ల్యూడబ్ల్యూఈకి జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటించగా..‘రెసిల్ మేనియా 41’చివరి ఈవెంట్ అనే విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఎంఎల్బీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. జాన్ సీనా శరీరం లేకుండా కేవలం జెర్సీ, బూట్లు, క్యాప్ , బాల్ వంటి వస్తువులను ఉపయోగించి ఓ పోస్ట్ విడుదల చేసింది.
His time is now!
Congrats to John Cena on his record-breaking 17th WWE World Championship #WrestleMania pic.twitter.com/Ow5w7bKfWD
— MLB (@MLB) April 21, 2025