Brahma Anandam OTT: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మ ఆనందం – ఎక్కడ చూడాలంటే

Brahma Anandam OTT Streaming: లాంగ్ గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫుల్‌లెన్త్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో ఆయన కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మ ఆనందం’. తండ్రికొడుకులైన వీరు వెండితెరపై తాత మనవళ్లుగా నటించిన ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రహ్మ ఆనందం ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పాం ఆహా సొంతం చేసుకుంది. అయితే మార్చి 20న స్ట్రీమింగ్‌కి ఇస్తున్నట్టు ప్రకటించిన ఆహా ముందు రోజే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం ఆహా గొల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసమే. అంటే రేపటి (మార్చి 20) నుంచి మూవీ అందరికి అందుబాటులోకి రానుంది. అయితే సడెన్‌గా బ్రహ్మ ఆనందం మూవీ ఓటీటీలో ప్రత్యక్షం అవ్వడంతో మూవీ లవర్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. తాత, మనవడు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ చిత్రం మెప్పించలేకపోయింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడది ఓటీటీలో మరింత ప్లస్ కానుంది.
ఈ సినిమా విషయానికి వస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మ స్టేజ్ షోలో చేస్తుంటాడు. ఒ మంచి సినిమా ఆఫర్ కోసం చూస్తున్న అతడి ఓ నాటకంలో నటించే అవకాశం వస్తుంది. అయితే దానికి అతడు రూ. 6 లక్షల వరకు డబ్బులివ్వాలని చెబుతాడు. ఆ డబ్బు కోసం చూస్తున్న అతడికి తన తాత ఆనంద్ రామ్ముర్తి(బ్రహ్మానందం) ఊరులో పోలం ఉందని, అది అమ్మి డబ్బులు ఇస్తానని చెబుతాడు. అయితే దీనికి ఆనంద్ రామ్ముర్తి కండిషన్ పెడతాడు.ఇంతకి అదేంటి? పొలం అమ్మారా? లేదా? చివరకు ఏమైందనేదే ‘బ్రహ్మ ఆనందం’ కథ.