Last Updated:

Sobhita First Love: చై కంటే ముందు అతడిపై మనసు పారేసుకున్న శోభిత – ఎవరో చెప్పేసిన నటి!

Sobhita First Love: చై కంటే ముందు అతడిపై మనసు పారేసుకున్న శోభిత – ఎవరో చెప్పేసిన నటి!

Not Naga Chaitanya is Sobhita Dhulipala’s First Lover: అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆమె గురించి చర్చ. ప్రస్తుతం ఈ కొత్త జంట వెకేషన్‌లో మోడ్‌లో ఉంది. అయితే నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి కాగా.. శోభితకు ఇది మొదటి పెళ్లి. అయితే నాగ చైతన్య కంటే ముందు శోభిత ఎవరిని లవ్‌ చేసింది, ఆమె పాస్ట్‌ లవ్‌ ఏంటనేది చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఫస్ట్‌ లవ్‌ గురించి స్వయంగా శోభిత చెప్పిన ఓల్డ్ కామెంట్స్‌ని నెటిజన్స్‌ గుర్తు చేస్తున్నారు.

రెండేళ్లు సీక్రెట్ డేటింగ్

నాగ చైతన్య, శోభితలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా డేటింగ్‌లో ఉంటూ మీడియాతో దోబూచులాడారు. విదేశాలకు జంటగా వెళ్లి మీడియాకు చిక్కారు. అయినా కూడా ఎప్పుడు ఈ జంట తమ ప్రేమను బయట పెట్టలేదు. తమ మధ్య ఏం లేదంటూ మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకునేవారు. ఇక చై అయితే సమంతతో విడాకుల తర్వాత తన లైఫ్‌ మళ్లీ ప్రేమే లేదన్నట్టు వ్యవహరించాడు. కానీ చివరకు గతేడాది ఆగష్టులో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరికి షాకిచ్చారు. ఆ తర్వాత డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

సమంతతో విడాకులు

హీరోయిన్‌ సమంతతో ప్రేమ పెళ్లి, విడాకుల తర్వాత శోభితను పెళ్లి చేసుకోవడంపై నెటిజన్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అయితే శోభిత ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలమే అవుతుంది. వీరద్దరి పరిచయం ఎలా అయ్యిందనే అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉంటే శోభిత చై కంటే ముందు ఎవరిని లవ్‌ చేసింది? అని కొందరు నెటిజన్స్‌ ఆరా తీయగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్స్‌ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. శోభిత తన కెరీర్‌లో ప్రారంభంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన ఫస్ట్‌ లవ్‌పై నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ తన స్కూల్‌ డేస్‌లో ఓ అబ్బాయిని లవ్‌ చేశానంది. “స్కూల్లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. అతడి అటెన్షన్‌ కోసం ఏవేవో చేసేదాన్ని. అయినా నన్ను చూసేవాడు కాదు.

అతడి ప్రవర్తన నన్ను బాధించేది. అప్పుడే మా స్కూల్లో వ్యాస రచన పోటీలు పెట్టారు. అందులో అయినా నేను టాప్‌ వస్తే నన్ను పట్టించుకుంటాడేమో అని అనుకుని, వ్యాసరచనలపై ఫోకస్‌ పెట్టాను. కానీ, ఈ క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి ఆలోచనలు దూరం అయ్యాయి. అతడి పట్టించుకోవడం మానేశాను. అప్పుడే నాలో మెచ్చ్యురిటీ రావడంతో అది ఉట్టి అట్రాక్షన్‌ అని గ్రహించి లైట్‌ తీసుకున్నాను” అని చెప్పుకొచ్చింది. అయితే కాలేజీలో తనకు ఎక్కువగా లవ్‌ ప్రపోజల్స్‌ వచ్చేవని చెప్పింది. లవ్‌ లెటర్స్‌ వచ్చేవని, తాను కూడా లెటర్స్‌ రాశానంది. అయితే అబ్బాయిల విషయంలో తన టేస్ట్‌ అస్సలు బాగుండేది కాదంటూ నవ్వుతూ చెప్పింది. కాగా గుఢాచారి చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శోభిత ఆ తర్వాత మేజర్‌, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది. మరోవైపు బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది.