Last Updated:

Darshan: జైలు నుంచి వచ్చిన తర్వాత దర్శన్‌ తొలి పోస్ట్‌ – అభిమానులను ఉద్దేశిస్తూ వీడియో సందేశం

Darshan: జైలు నుంచి వచ్చిన తర్వాత దర్శన్‌ తొలి పోస్ట్‌ – అభిమానులను ఉద్దేశిస్తూ వీడియో సందేశం

Darshan Shared a Video: కన్నడ స్టార్‌ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో విడుదలైన బయటకు వచ్చిన దర్శన్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. ఇందులో అభిమానులను ఉద్దేశిస్తూ అతడు సందేశం ఇచ్చాడు.

ఈ వీడియో దర్శన్‌ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. ఈ కష్ట సమయాల్లో మీ ప్రేమ నాలో ధైర్యాన్ని నింపింది. నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి క్రతజ్ఞతలు. దీనికి ఏ పదం వాడిన తక్కువే. మీ అనంతమైన ప్రేమకు క్రతజ్ఞుడిని. మీ అపారమైన ప్రేమ వల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. వ్యక్తిగతం కలిసి మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్న. కానీ కుదరడం లేదు. ఎందుకో మీ అందరికి తెలుసు. నేను ఇలా ముందుకు రావడానికి కారణం నా పుట్టిన రోజు. ఫిబ్రవరి 16న నా పుట్టిన వస్తుంది. నేను ఈ సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఎందుకో మీ అందరికి తెలుసు. నా ఆరోగ్యం బాగానే ఉంది.

ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీ అందరికి తెలిసిందే. నాకు ఇంజెక్షన్‌ ఇచ్చినంత వరకు ఒకే బాగానే ఉంటుంది. కానీ దానికి పవర్‌ తగ్గిపోగానే తీవ్ర నొప్పి వస్తుంది. ఆపరేషన్‌కు అంతా సిద్ధం అవుతుంది. త్వరలోనే శస్త్ర చికిత్స జరగనుంది. దానికి వల్లే నేను నా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. నా పుట్టిన రోజు కోసం సన్నాహాలు చేస్తున్న ప్రతి అభిమాని నన్ను క్షమించాలని కోరుతున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తా” అంటూ వీడియోలో మాట్లాడుకొచ్చాడు. ప్రస్తుతం దర్శన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోకు గెట్‌ వెల్‌ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

దర్శన్‌ వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసు కన్నడ నాట సంచలనంగా మారింది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నాడనే కారణంగా అతడిని బంధించిన తీవ్రంగా హింసించి హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దర్శన్‌, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసుల అరెస్ట్‌ చేశారు. ఇందులో దర్శన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌ ఆరు నెలలపాటు పరప్పన జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా దర్శన్‌ తరపు న్యాయవాదులు ఈ కేసులో అతడి బెయిల్‌ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించింది.

కానీ, ఫలితం లేకుండ పోయింది. మరోసారి బెయిల్‌ కోసం పటిషన్‌ వేయగా ఇందులో అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్స అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి విచారించిన విశ్వజిత్‌ శెట్టి ధర్మాసనం దర్శన్‌కి బెయిల్‌ మంజూరు చేసింది. ఇటీవల విడుదలైన దర్శన్‌ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్‌ చేస్తున్నాడు. సినిమా షూటింగ్‌లకి కూడా వెళ్లడం లేదు. త్వరలోనే ఆయనకు శస్త్ర చికిత్స జరగనుంది.