Last Updated:

Rajendra Prasad: పుష్ప 2 హీరోపై అలాంటి కామెంట్స్‌ – క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్‌

Rajendra Prasad: పుష్ప 2 హీరోపై అలాంటి కామెంట్స్‌ – క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్‌

Rajendra Prasad About His Comments on Allu Arjun: పుష్ప 2 సినిమా హీరో పాత్రపై తాను చేసిన వాఖ్యాలను వక్రీకరించారన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్‌ భాగంగా రాజేంద్ర ప్రసాద్‌ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అప్పట్లో పుష్ప 2పై ఆయన చేసిన కామెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ హరికథ.

క్రైం, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కని ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్‌ పుష్ప 2 మూవీని ఉద్దేశిస్తూ ప్రస్తావించారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో అంటున్నారు. ఈ రోజుల్లో హీరో అనే పదానికే అర్థాలు మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారాయి.

అప్పటికే పుష్ప 2కి కాస్తా వ్యతిరేక వస్తున్న నేపథ్యంలో రాజేంద్రప్రసాద్‌ కామెంట్స్‌ మరింత దుమారం రేపాయి. తాజాగా తన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ పుష్ప 2 చిత్రంలో హీరో పాత్రపై తాను చేసిన కామెంట్స్‌ని వక్రీకరించారన్నారు. తన తాజా చిత్రం షష్టిపూర్తి మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన తన కామెంట్స్‌కు వివరణ ఇచ్చారు. ఒకప్పుడు సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు అనేవారు. కానీ ఇప్పుడు జులాయి తిరిగేవాడు. చెడు అలవాట్లు ఉండి, పెద్దలతో తిరగబడే వారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు.

నిజానికి ఇప్పటి వారు అలాంటి హీరో పాత్రలనే ఇష్టపడుతున్నారు. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోలకు జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఆ ఉద్దేశంతోనే తాను ఈ కామెంట్స్‌ చేశాన్నారు. కానీ మీడియా వాళ్లు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇటీవల తాను అల్లు అర్జున్‌ని కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకుని సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులను చూసి నవ్వుకున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్‌గా చూడకూడదని, సమాజంలో మన చుట్టూ ఉ న్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తారన్నారు.