Last Updated:

Parliament Winter Session: రేపటికి వాయిదా పడిన పార్లమెంట్ ఉభయసభలు

Parliament Winter Session: రేపటికి వాయిదా పడిన పార్లమెంట్ ఉభయసభలు

Parliament Winter Session  Postponed: పార్లమెంట్ సమావేశాలల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం వాయిదాపడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ కార్యక్రలాపాలు ఉదయం 11 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి.

అదానీ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష ఎంపీల ఆదోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సభా ప్రారంభం ముందు వాయిదా తర్వాత కూడా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు నిరసనకు దిగాయి. అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశాయి. అదానీ వ్యవహారంపై ఉభయసభలు దద్దరిల్లాయి.

లోక్ సభలో ఐదోరోజు వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్షాలు పట్టుపడుతూ నినాదాలు చేశాయి. సంభాల్, మణిపూర్ లో లా అండ్ ఆర్డర్‌పై చర్చకు పట్టుబడుతూ ప్రశ్నోత్తరాలకు అడ్డు తగిలాయి. సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరారు. ఎంతసేపటికీ సర్దుమణుకపోవడంతో తొలుత మధ్యాహం 12 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ మల్లీ గొడవ ప్రారంభం కావడంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

ఇక, రాజ్యసభలోనూ అదే తీరు కనబడింది. అదానీ వ్యవహారం, సంభాల్, మణిపూర్ లో లా అండ్ అర్డర్‌పై ఇండియా కూటమి పార్టీలు చర్చలు నోటీసులు ఇచ్చాయి. అయితే తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో ప్రజా సమస్యలపై చర్చ సాగనీయకుండా అడ్డుతగలడం సరికాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైర్మన్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి ప్రారంభమైన మళ్లీ విపక్షాలు వాగ్వాదం చేయడంతో సభను రేపటికి వాయిదా వేశారు.