Home / ట్రెండింగ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Hyderabad: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అద్భుతమైన రీల్స్ చేసే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిని గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తే.. విజేతకు రూ. 50 వేల ప్రైజ్ ప్రకటించింది.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
ఏ సాలా కప్ నందే.. ఐపీఎల్ 16వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సూపర్ విక్టరీ తో ప్రారంభించి అభిమానులందరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ని చిత్తుగా ఓడించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించి మంచి బోణి కొట్టారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతున్న ప్రోగ్రామ్ లలో ఈటీవీలో ప్రసారమవుతున్న వినోదభరిత కార్యక్రమం ” శ్రీదేవి డ్రామా కంపెనీ“. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఎంటర్టైన్మెంట్ షోల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ షో లో కూడా దాదాపు జబర్దస్త్ షో లో కమెడియన్స్ వారి వారి శైలిలో అలరిస్తూ ఉంటారు. ఈ షో కి యాంకర్ గా రష్మి చేస్తుండగా.. జడ్జిగా ఇంద్రజ చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి ( ఏప్రిల్ 1 ) నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు టోల్ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హచ్ఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది.
మన దేశం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఠక్కున అందరూ చెప్పే ఏకైక మాట "భిన్నత్వంలో ఏకత్వం". విభిన్న ప్రాంతాలు.. విభిన్న మతాలు.. విభిన్న ఆచారాలు.. ఇలా ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక్కటిగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాం. అదే విధంగా ఆహారం విషయంలో కూడా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి.
సాధారణంగా వర్షాలు.. ఉరుములు.. మెరుపులు అనేవి సర్వ సాధారణం. కానీ అనుకోని రీతిలో పిడుగుపాటుకు పలువురు మృత్యువాత పడిన ఘటనలను మనం చూస్తున్నాం. అయితే ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. అదికూడా అర గంట వ్యవధిలో.. భీకరమైన శబ్దాలతో విజృంభిస్తే ఎలా ఉంటదో ఊహించడానికే భయంగా ఉంది.
ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’