Manchu Vishnu Vs Manchu Manoj : మంచు మనోజ్ తో గోడవపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు.. “హౌస్ ఆఫ్ మంచుస్”
ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’

Manchu Vishnu Vs Manchu Manoj : గత కొంతకాలంగా మంచు వారింట అన్నదమ్ములైన మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వీటన్నింటినీ నిజం చేస్తూ ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ.. ఇది సిచ్యుయేషన్.. ఇది సిచ్యుయేషన్.. అని మనోజ్ వీడియో రికార్డ్ చేస్తూ చెప్తూ ఉన్నాడు.
రెండు, మూడు రోజులు పాటు అన్ని ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఈ వివాదం గురించి బాగా చర్చించారు. ఇక విష్ణు, మనోజ్ గొడవపై మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అసలు నాకు గొడవ గురించి తెలీదు అంటూ కామెంట్స్ చేసింది. మనోజ్ కూడా సదరు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నైస్ గా తప్పించుకున్నాడు. కాగా ఇప్పుడు మంచు విష్ణు తన సోషల్ మీడియాలో ఈ వివాదంపై ఓ వీడియోని పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ది బిగ్గెస్ట్ రియాలిటీ షో.. హౌస్ ఆఫ్ మంచుస్ (Manchu Vishnu Vs Manchu Manoj)
ఆ వీడియోలో .. మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు అన్ని ఛానల్స్ లో వచ్చిన ఈ గొడవ కవరేజ్, మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వీడియో బిట్స్ చూపించారు. ఇందులో నా పేరు విష్ణు మంచు, మోహన్ బాబు గారబ్బాయిని అంటూ చెప్పాడు. చివర్లో ది బిగ్గెస్ట్ రియాలిటీ షో, హౌస్ ఆఫ్ మంచుస్ అని టైటిల్ వేయడంతో అంతా షాక్ అయ్యారు. అలాగే ఈ వీడియోలో ఎక్కడా కూడా మనోజ్ ని చూపించకపోవడం గమనార్హం. స్ట్రీమింగ్ ఇన్ 2023 అని కూడా పెట్టడం విశేషం. ఇక ఈ వీడియోని పోస్ట్ చేసి ఇది ఆరంభం మాత్రమే అని ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టాడు. అయితే నిజంగానే మంచు ఫ్యామిలీ రియల్ రియాలిటీ షో ప్లాన్ చేస్తుందా లేక ఇది కూడా గొడవలో భాగమేనా, ఇదంతా ప్రమోషన్ స్ట్రాటజీనా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
𝚃𝚑𝚒𝚜 𝚒𝚜 𝚓𝚞𝚜𝚝 𝚝𝚑𝚎 𝙱𝚎𝚐𝚒𝚗𝚗𝚒𝚗𝚐!
https://t.co/xVJsrrpLIK#HOM #HouseOfManchus
— Vishnu Manchu (@iVishnuManchu) March 30, 2023
ఇవి కూడా చదవండి:
- Mekapati Chandrasekhar Reddy : నడిరోడ్డు మీద కూర్చోని.. వారికి సవాల్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- Anchor Sreemukhi : అందాల తెరల హద్దులను చెరిపేస్తున్న యాంకర్ శ్రీముఖి..
- Dahi Controversy: తమిళనాడులో అసలేంటీ ‘దహీ’ వివాదం?