Home / ట్రెండింగ్ న్యూస్
ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గజరాజులు గటగటా నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి. ఇక వాటిని నిద్రలేపడానికి గ్రామస్థులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనుకోండి.
జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. ఇకపై జీమెయిల్ వినియోగదారులంతా కొత్త జీమెయిల్ డిజైన్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గూగుల్ పేర్కొనింది. ఈనెల నుంచి గూగుల్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషన్ క్రష్ అయిన రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా తన కాలాన్ని గడుపుతుంది. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. అయితే తాజాగా ఈ అందాల భామ గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న రూమర్స్, ట్రోల్స్ గురించి తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
నార్వే యువరాణి వంశపారం పర్యంగా వచ్చిన సకల భోగాలను కాలదన్ని.. తన ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రిన్సెస్ హోదాతో పాటు విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే కూడా బాగా తగ్గిపోయింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి 44 బిలియన్ డాలర్లను చెల్లించడానికి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ప: ది రూల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. సుకుమార్ షూట్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని చిత్రీకరణకు వెళ్లాలని చిత్రబృందాన్ని కోరాడు.
సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతంగా జరిగింది. థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సహా, ఈ చిత్రం వ్యాపారం రూ. 50 కోట్ల మార్కును దాటింది.
భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదీ జట్టు పాకిస్థాన్ పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ సిడ్నీ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీస్ మ్యాచ్ లో భాగంగా కివీస్‌పై పాక్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు తేడాతో చేధించింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు.