Princess Martha Louise: వివాదాస్పద మతగురువును పెళ్లి చేసుకోనున్న నార్వే యువరాణి
నార్వే యువరాణి వంశపారం పర్యంగా వచ్చిన సకల భోగాలను కాలదన్ని.. తన ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రిన్సెస్ హోదాతో పాటు విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Norway: నార్వే యువరాణి వంశపారం పర్యంగా వచ్చిన సకల భోగాలను కాలదన్ని, తన ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రిన్సెస్ హోదాతో పాటు విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వివాదాస్పద మతగురువుతో పెళ్లి చేసుకొని మెడిసిన్ వ్యాపారంలో అడుగుపెడుతున్నట్లు చెప్పారు. 51 ఏళ్ల ప్రిన్సెస్ మార్తా లూయిస్ ఒక ప్రకటనలో తాను టైటిల్ ఉంచుకుంటాననని, అయితే అధికార విధుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన వ్యాపార లావాదేవీలకు రాయల్ ఫ్యామలీ విధులను విడదీశారు.
ఈ ఏడాది జూన్‌లో నల్లజాతీయుడైన డ్యూరెక్ వెరెట్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. తనకు తాను ఆయన సిక్స్త్ జనరేషన్ షామన్‌గా చెప్పుకుంటున్నారు. ఇక్కడ షామన్ అంటే భూత వైద్యుడిగా చెప్పుకోవచ్చు. మంత్రాలతో జబ్బులను నయం చేస్తానంటున్నాడు. కోవిడ్ -19 లాంటి జబ్బులను కూడా నయం చేశానని చెప్పుకున్నాడు. ఆధ్యాత్మిక అంశాల పై ఆయన పుస్తకాలు కూడా ప్రచురించారు.
నల్లజాతికి చెందిన డ్యూరెక్ వెరట్ పై నార్వేలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికులు అతను మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్వే కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి ఎర్నా సోల్‌బెర్గ్ మాత్రం వెరెట్టా అభిప్రాయలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఆయన ఇచ్చే మందులు నాలెడ్జ్ బెస్డ్ కావని స్పష్టం చేశారు.