Home / ట్రెండింగ్ న్యూస్
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాల దృష్ట్యా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. కాగా ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మరియు సినీ ప్రముఖులు అయిన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ వంటి పలువురు తారలు నివాళులర్పించారు. సినీలోకం దిగ్గజ నటుడిని కోల్పోయిందని వారు అన్నారు.
ప్రపంచంలో కేవలం 45 మంది మాత్రమే కలిగి ఓ కొత్త రకం బ్లడ్ గ్రూప్ ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకనే ఈ బ్లెడ్ చాలా అరుదైనదని విలువైనదని అంటున్నారు. ఇంతకీ ఈ బ్లెడ్ గ్రూపు పేరేంటో తెలుసా గోల్డెన్ బ్లడ్ గ్రూప్.
యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి, రిషి సునక్ ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో పని చేయడానికి భారతదేశానికి చెందిన యువ నిపుణుల కోసం కనీసం 3,000 వీసాలకు అనుమతినిచ్చారు. .
సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరందరిలో మంజులకు తండ్రితో అనుబంధం ఎక్కువ. తండ్రితో ప్రతీ విషయాన్ని ఆమె షేర్ చేసుకునేవారు. తాజాగా తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు చేసారు.
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.
తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
మనదేశంలో తయారైన దగ్గు మందుతో జాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్లు మొన్నామధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ వార్తలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. మన దగ్గర తయరైన దగ్గుమంతో జాంబియాలో చిన్నారు మృత్యవాత పడినట్టు ఆఫ్రికా ఆరోపించడం భారత్‌కు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్‌కు హాజరయ్యారు.