Last Updated:

Megastar Chiranjeevi : టాలీవుడ్ లో రాఖీ సందడి.. సోదరీలతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టువులకు రాఖీలు ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక అల్లు వారి ఇంట్లోనూ రక్షా బంధన్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. అల్లు అర్జున్‌ గారా పట్టి అల్లు అర్హ

Megastar Chiranjeevi : టాలీవుడ్ లో రాఖీ సందడి.. సోదరీలతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్

Megastar Chiranjeevi : అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టువులకు రాఖీలు ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక అల్లు వారి ఇంట్లోనూ రక్షా బంధన్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. అల్లు అర్జున్‌ గారా పట్టి అల్లు అర్హ తన అన్నయ్య అయాన్‌ రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలను బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి. వీరితో పాటు శ్రీముఖి, సన్నీలియోన్‌, పూజాహెగ్డే, సారా అలీఖాన్‌ ఇంట్లోనూ రాఖీ వేడుకలు జరిగాయి. వీరు తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.

ఇక టాలీవుడ్‌ మెగాస్టార్‌ ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన సోదరీలు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అనంతరం ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ మేరకు చిరు అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు చిరంజీవి.

 

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన “భోళాశంకర్‌” చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. తమిళంలో అజిత్ నటించిన వేదాళం రీమేక్‌ గా వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇక ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు బింబిసార దర్శకుడు వశిష్టతో తెరకెక్కిస్తోన్న ఓ సోషియో పాంటసీ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలానే తన కూతురు సుస్మిత ప్రొడక్షన్ బ్యానర్‌లోనూ ఓ కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.