Last Updated:

Janasena Party : ఆ విషయంలో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ “జనసేన”.. దరిదాపుల్లో కూడా లేని వైకాపా

ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.

Janasena Party : ఆ విషయంలో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ “జనసేన”.. దరిదాపుల్లో కూడా లేని వైకాపా

Janasena Party : ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు. కానీ ఆ తర్వాత వైకప కి మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్ల లోనూ ఓడిపోయారు.

కానీ ఇదంతా ఒక వైపు మాత్రమే.. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో పెను సంచాలనమే సృష్టించారు అనడంలో సందేహం అంటూ అక్కర్లేదు. 2014 లో తెదేపా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పరిస్థితుల రీత్యా ప్రజలు జగన్ సర్కారుకి విజయాన్ని అందించినప్పటికి ఆయన వెనుకడుగు వేయలేదు. ప్రజల కోసం ఎల్లప్పుడూ ఒక వారాధిలా నిలబడుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రశ్నించేందుకు ఎప్పుడు ముందు ఉంటూనే ఉంటున్నారు. పవన్ కి జనసేనాని ప్రయాణంలో ఆయనకు మరింత సపోర్ట్ ఇచ్చేంది సోషల్ మీడియా విభాగం కూడా. తాజాగా జనసేన సోషల్ మీడియా విభాగం ఒక రికార్డు సాధించింది.

మీరే పార్టీకి ప్రధాన బలం – పవన్ కళ్యాణ్ (Janasena Party)

జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా 2 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది. జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా 2 మిలియన్స్ సాధించడం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘జనసేన పార్టీ 2 మిలియన్ (20 లక్షలు) ఫాలోవర్స్ మార్క్ అందుకున్నందుకు హృదయ పూర్వక అభినందనలు. జనసేన ట్విట్టర్ టీంకు, సోషల్ మీడియా జనసైనికులకు నా శుభాకాంక్షలు. జనసేన పార్టీకి మీరే ప్రధాన బలం.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ట్విట్టర్‌లో జనసేన అధికారిక ఖాతా 2 మిలియన్స్ ఫాలోవర్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8.38 లక్షల మందితో రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ 8.10 లక్షల మందితో మూడో స్థానంలో ఉంది. అలాగే, తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు 5.56 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. అభిమానులు జనసేనకి అండగా మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే.. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ.. ఎదుగుతూ.. ప్రజా మద్దతు పొందుతూ వస్తున్నాం.. ఇన్నాళ్లలో మేము గెలవకపోవచ్చు.. కానీ ఓడించింది మాత్రం మేమే.. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం అంటూ సోషల్ మడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 

మరోవైపు జనసేన పార్టీ ఆవిర్బవించి 9 ఏళ్లు పూర్తయ్యి..  పదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణాజిల్లా మచిలీపట్నాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 14న బందరులో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. పవన్ తన ప్రచార వాహనం వారాహిలో బందరులో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు రానున్నారు. ఇప్పటి వరకూ కేవలం వారాహిని పూజల కోసం మాత్రమే బయటికి తీసిన పవన్ కళ్యాణ్.. తొలిసారి రాజకీయ కార్యక్రమానికి వారాహిని వాడబోతున్నారు. ఏప్రిల్ నుంచి వారాహిలో రాష్ట్రమంతా తిరగాలని భావిస్తున్న పవన్.. దీనికి టీజర్ గా బందరు సభకు తీసుకురానున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/