Last Updated:

Samsung New Budget Phones: కాస్త పక్కకెళ్లి ఆడుకోమ్మ.. సామ్‌సంగ్ గెలాక్సీ ‘F’ సిరీస్‌ ఫోన్లు వస్తున్నాయ్.. చాలా చీప్‌గా..!

Samsung New Budget Phones: కాస్త పక్కకెళ్లి ఆడుకోమ్మ.. సామ్‌సంగ్ గెలాక్సీ ‘F’ సిరీస్‌ ఫోన్లు వస్తున్నాయ్.. చాలా చీప్‌గా..!

Samsung Galaxy F16: సామ్‌సంగ్ తన గెలాక్సీ F సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో టీజ్ చేశారు. ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ Galaxy F16 5G పేరుతో విడుదల కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చాలా సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించింది. ఈ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Galaxy F15 5Gకి సక్సెసర్. ఇది కాకుండా,  F సిరీస్‌లోని మరొక బడ్జెట్ ఫోన్ Galaxy F06 గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ చౌకైన సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB RAM, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఈ గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ మాక్రో పేజీలో చూడొచ్చు. అలాగే,  అనేక సర్టిఫికేషన్ సైట్‌లలో లిస్ట్ చేసిన Samsung Galaxy F16 5G ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందించవచ్చు.

కొన్ని రోజుల క్రితం, ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ పేజీ దేశంలో లైవ్ కానుంది. సపోర్ట్ పేజీలో ఈ సామ్‌సంగ్ ఫోన్ మోడల్ నంబర్ SM-E166P/DSతో లిస్ట్ అవుతుంది, ఇంతకుముందు, ఈ బడ్జెట్ ఫోన్ WiFi అలయన్స్ డేటాబేస్లో కూడా లిస్ట్ అయింది, ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తుందని తెలియజేస్తుంది.

Samsung Galaxy F16 Features
‘సామ్‌సంగ్ గెలాక్సీ F16 దేశంలో గెలాక్సీ A16  రీబ్రాండెడ్ మోడల్‌గా లాంచ్ చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్  ప్రారంభ ధర రూ. 18,999, ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ ఆమ్లోడ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ 6300 ప్రాసెసర్ చూడచ్చు. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. అందులో 50MPమెయి, రెండు 5MP సెన్సార్లు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ,  25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.