Realme Neo 7 SE – Neo 7x launched: ఖతర్నాక్ ఫోన్లు వచ్చేశాయ్.. AI కెమెరా అంటే ఇలా ఉండాలి.. రూ.15 వేలకే మీ సొంతం..!

Realme Neo 7 SE – Neo 7x launched: చైనాకు చెందిన టెక్ దిగ్గజ బ్రాండ్ రియల్‌మీ ఎల్లప్పుడూ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. తాజాగా కంపెనీ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ ‘Realme Neo 7 SE, Realme Neo 7x’లను ఒకేసారి విడుదల చేసింది. వీటిలో AI పవర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అలానే పవర్ ఫుల్ 7000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ల ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Realme Neo 7 SE Specifications
స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K ఫ్లాట్ గేమింగ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 450ppi పిక్సెల్ డెన్సిటీ, 6000నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఈ డిస్‌ప్లే 120Hz LTPO రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఫోన్‌లో DC-వంటి డిమ్మింగ్,TUV రీన్‌షీల్డ్ స్మార్ట్ ఐ-ప్రొటెక్షన్, AI ఫంక్షన్‌ల వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ IP69 రేటింగ్, క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్ ఫీచర్‌తో వస్తుంది.
రియల్‌మీ నియో 7 SEలో మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ ప్రాసెసర్, 12GB డైనమిక్ మెమరీ, 16GB వరకు RAM ఉంది. ఈ ఫోన్ UFS 4.0 స్టోరేజీని 512GB వరకు అందిస్తుంది. Realme UI 6.0తో వస్తున్న ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, వెనుక ప్యానెల్‌లో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోన్ 7000mAh బ్యాటరీతో 80W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ధర 1799 యువాన్ (సుమారు రూ. 21,600).
Realme Neo 7x Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2000నిట్‌ల పీక్ బ్రైైట్నెస్ అందిస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలానే ఇందులో 12GB ఇన్‌స్టాల్ చేసిన RAMతో పాటు, 512GB వరకు స్టోరేజ్ అందించారు.అలాగే 12GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0లో రన్ అవుతుంది. వెనుక ప్యానెల్‌లో 50MP AI పవర్‌తో కూడిన వెనుక కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా, AI ఫీచర్లు, 6000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. ఫోన్ ధర 1299 యువాన్ (సుమారు రూ. 15,600).