Published On:

Realme 13 Plus 5G Price Drop: మిత్రమా.. రెడీగా ఉండు.. Realme 13+ 5Gపై భారీ డిస్కౌంట్.. ఊహించని ఆఫర్లు..!

Realme 13 Plus 5G Price Drop: మిత్రమా.. రెడీగా ఉండు.. Realme 13+ 5Gపై భారీ డిస్కౌంట్.. ఊహించని ఆఫర్లు..!

Realme 13 Plus 5G Price Drop: రియల్‌మి తన అభిమానులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ స్టైలిష్ 5G స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. Realme 13+ 5G మొబైల్‌పై 2000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను మూడు స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌‌పై మొబైల్ రన్ అవుతుంది. అలానే 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మొబైల్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Realme 13 Plus 5G Offers
12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన Realme 13+ 5G ఫోన్ రూ.26,999 కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఇది రూ.24,999 కు లభిస్తుంది. కంపెనీ దీని ధరను రూ.2,000గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 20 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కు అమ్ముడవుతోంది.

 

Realme 13 Plus 5G Features
Realme 13 Plus 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది సామ్‌సంగ్ E4 అమోలెడ్ స్క్రీన్. ఈ డిస్‌ప్లే 2,400 × 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఉన్నాయి.

 

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం మాలి G615 GPUని కూడా ఉంది. దీనితో పాటు, ఈ ఫోన్ 9 5G బ్యాండ్‌లకు కూడా సపోర్ట్ ఇస్తుంది. మొబైల్‌లో రెండు ర్యామ్ ఎంపికలు ఉన్నాయి. ఇది 8GB,12GB లతో వస్తుంది. దీనికి 14GB వరకు డైనమిక్ ర్యామ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో మొత్తం 26GB RAM వరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

 

Realme 13 Plus 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు, సెకండరీ కెమెరాలో 2-మెగాపిక్సెల్ మోనో లెన్స్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఈ మొబైల్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ ‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. దీన్ని ఛార్జ్ చేయడానికి, 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. ఈ ఫోన్‌ను వాటర్, డస్ట్ నుండి ప్రొటక్డ్ చేయడానికి IP65 రేటింగ్‌ ఇచ్చారు.