OnePlus 13R Price Drop: మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా?.. ఇదే పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్.. ప్రేమను రెట్టింపు చేయండి..!

OnePlus 13R Price Drop: వన్‌ప్లస్ ఇటీవలె OnePlus 13 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో OnePlus 13, OnePlus 13R అనే రెండు మోడల్‌లను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లోని OnePlus 13Rపై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాలెంటైన్స్ డే ఆఫర్‌లతో రూ. 40,000 కంటే తక్కువ ధరకు కొనడానికి అందుబాటులో ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వడానికి లేదా గేమింగ్, ఫోటోగ్రఫీకి OnePlus 13R పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్‌పై రూ.9000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
OnePlus 13R Offer
వన్‌ప్లస్13ఆర్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 42,998కి అందుబాటులో ఉంది. అయితే మొబైల్ లాంచింగ్ ప్రైస్ రూ.44,999. అంటే ఫోన్ పై రూ.2000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. మీరు OneCard క్రెడిట్ కార్డ్ లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ. 3,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అయితే ఏదైనా ఫోన్‌ని మార్చుకుంటే, ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువపై రూ. 4,000 తగ్గింపు ఇస్తున్నారు, అంటే మీరు ఫోన్‌లోని ఆఫర్‌లతో రూ. 9,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
OnePlus 13R Specifications
వన్‌ప్లస్13ఆర్ 5G 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 AMOLED ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ అందిస్తుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి . ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 mAh బ్యాటరీ ఉంది, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనంగా, ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 సర్టిఫికేషన్‌తో వస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం వన్‌ప్లస్13ఆర్ లో 50MP ప్రైమరీ కెమెరా కనిపిస్తుంది. దీనితో పాటు, ఫోన్‌లో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్. 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 4 సంవత్సరాల వరకు మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లను, 6 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను అందిస్తుంది, 13Rని ఇతర మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో సమానంగా ఉంచుతుంది.