Last Updated:

OnePlus 13 mini: వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ వచ్చిందోచ్‌.. 80W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌.. అదిరిపోయే కెమెరా!

OnePlus 13 mini: వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ వచ్చిందోచ్‌.. 80W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌.. అదిరిపోయే కెమెరా!

OnePlus 13 mini: వన్‌ప్లస్ OnePlus 13 mini లేదా OnePlus 13T పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో, చైనా నుండి వచ్చిన కొత్త లీక్ ప్రకారం.. కొత్త OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ 6,200 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బ్యాటరీ 80W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే, ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఇటీవల కంపెనీ విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ OnePlus 13 స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దదిగా ఉంటుంది. OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 6,000 mAh బ్యాటరీని మాత్రమే ప్యాక్ చేస్తుంది.

 

వన్‌ప్లస్ 13 మినీ స్మార్ట్‌ఫోన్ ఈ ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ కానుంది. అయితే, ఈ OnePlus గురించి కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే, విశ్వసనీయ టెక్ మీడియా నివేదికల ప్రకారం, ఈ రాబోయే OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అలాగే దీని స్క్రీన్ 1.5K రిజల్యూషన్, ఎంబెడెడ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ 50 MP మెయిన్, 2x ఆప్టికల్ జూమ్‌తో కలిగి ఉన్న కెమెరాల గురించి కొంత సమాచారం ఉంది.

 

చైనీస్ మొబైల్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం, కొత్త OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ అత్యంత సరసమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఎలైట్ చిప్‌తో ప్యాక్ చేయబడుతుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల LTPO OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగంలో, ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉండవచ్చు.

 

OnePlus 13 మినీ ఫోన్ ధర CNY 3,099 (దాదాపు రూ. 37,000) కంటే తక్కువగా ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈసారి OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ ప్రామాణిక వృత్తాకార కెమెరా మాడ్యూల్‌కు బదులుగా బార్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండవచ్చు. దీని కాంపాక్ట్ డిజైన్‌తో పాటు, 6,200 mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది OnePlus 13 సిరీస్‌లో చౌకైన ఫోన్‌గా మార్చగలదు, అయితే దీని గురించి అధికారిక సమాచారం OnePlus కంపెనీ నుండి ఇంకా బయటకు రాలేదు.

 

లీక్స్ నిజమైతే OnePlus 13 Mini స్మార్ట్‌ఫోన్ ఈ ఏప్రిల్ లేదా Q2 2025లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ OnePlus 13 Mini భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. OnePlus చివరిసారిగా T-series OnePlus 10Tని భారతదేశంలో ఆగస్టు 2022లో విడుదల చేసింది, దీని ధర రూ. 49,999. కాబట్టి, ఈ కొత్త OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లభిస్తుందో లేదో చూడాలి.

 

OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 6.31-అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లే ఉంది. 6000mAh బ్యాటరీ అందించారు. 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP ప్రధాన కెమెరా చూడచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 15.1లో పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి: