Google Pixel 9a Discount Offer: డిస్కౌంట్ల జాతరే.. Google Pixel 9a.. ఫస్ట్ సేల్‌లో భారీ ఆఫర్లు..!

Google Pixel 9a Discount Offer: గూగుల్ ఇటీవల తన పిక్సెల్ 9 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్‌ను పరిచయం చేసింది, దీనిని కంపెనీ పిక్సెల్ 9aగా ప్రారంభించింది. అదే సమయంలో, ఈ కొత్త ఫోన్ సేల్ ఈరోజు నుండి ప్రారంభమైంది. Google Pixel 9a లో మీరు టెన్సర్ G4 చిప్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. దేశంలో ఈ ఫోన్ ధర రూ.49,999. ఈరోజు నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత దేశంలో కొనుగోలు చేయచ్చు. పిక్సెల్ 9a ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ , ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఒక ప్రత్యేక లాంచ్ ఆఫర్ కూడా ఉంది, ఇక్కడ మీరు దానిని చౌకగా కొనుగోలు చేయచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Google Pixel 9a Discount
భారతదేశంలో పిక్సెల్ 9a 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది, దీని ధర రూ.49,999. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ రిలయన్స్ డిజిటల్‌లో 10శాతం వరకు తగ్గింపుతో లభిస్తుంది. 10 శాతం తగ్గింపు అంటే ఫోన్ ధర దాదాపు రూ. 5,000 తగ్గుతుంది. అంటే మీరు ఫోన్‌ను రూ.45,000 కి మీ సొంతం చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది, ఇక్కడ మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI లావాదేవీలపై రూ. 3,000 వరకు తగ్గింపు పొందచ్చు. దీని వలన ఫోన్ ధర రూ.46,999 అవుతుంది. ఇది కాకుండా, మీరు క్రోమా ద్వారా కూడా ఇలాంటి ఆఫర్‌లను పొందవచ్చు. అదే సమయంలో మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఫోన్ ధర రూ.47,499 మాత్రమే.
Google Pixel 9a Features
ఈసారి కొత్త Pixel 9a దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా పెద్ద అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది, దీనిలో కొత్త డిజైన్, మెరుగైన హార్డ్‌వేర్ అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ 9a ఇప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పెద్ద 6.3-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది.
Google Pixel 9a Camera Features
ఈ ఫోన్‌ను అత్యంత ప్రత్యేకమైనదిగా చేసేది దాని కొత్త వెనుక కెమెరా లేఅవుట్. మునుపటి పిక్సెల్ మోడళ్లలో ఉన్న కెమెరా బార్‌ను ఈ మోడల్ నుండి గూగుల్ తొలగించింది. ఈ ఫోన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌ను పొందుతుంది. సెల్ఫీల కోసం 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Google Pixel 9a Battery
పిక్సెల్ 9a గూగుల్ కొత్త Tensor G4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా అప్‌గ్రేడ్ అయింది. ఫోన్ ఇప్పుడు పెద్ద 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది Pixel 8aలోని 4,402mAh బ్యాటరీ కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ ఫోన్ 23W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుం. Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- OnePlus Nord CE 5 Leaked Features: బడ్జెట్లో మంచి ఫోన్.. OnePlus Nord CE 5 వచ్చేస్తోంది.. పెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫీచరే!