Last Updated:

Realme 14 Pro 5G Discount: ఏం పర్లేదు.. రూ.1,093కే రియల్‌మీ 5జీ ఫోన్.. మిస్ చేయకండి బ్రదర్..!

Realme 14 Pro 5G Discount: ఏం పర్లేదు.. రూ.1,093కే రియల్‌మీ 5జీ ఫోన్.. మిస్ చేయకండి బ్రదర్..!

Realme 14 Pro 5G Discount: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ రియల్‌మీ 14 ప్రోను జనవరి నెలలో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో కంపెనీ Realme 14 Pro, Realme 14 Pro Plus 5Gని విడుదల చేసింది. ప్రో, ప్రో ప్లస్ వేరియంట్‌లలో కస్టమర్‌లు ప్రత్యేక ఫీచర్‌లను చూస్తారు. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే ‘Realme 14 Pro’ బెస్ట్ ఆప్షన్.

Realme 14 Pro లాంచ్ అయ్యి కొద్ది రోజులే అయింది కానీ దాని ధర గణనీయంగా తగ్గింది. రియల్‌మీ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. దీనిలో మీకు ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీనిలో ట్రిపుల్ LED ఫ్లాష్ లైట్ అందించారు. ఈ ఫోన్‌లో లభించే డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme 14 Pro 5G Offers
రియల్‌మీ 14 ప్రో 5జీ 256GB వేరియంట్ ప్రస్తుతం దాని అసలు ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 29,999 ధరతో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ భారీ ధర తగ్గింపుతో విక్రయిస్తున్నారు. అమెజాన్ కస్టమర్లకు దానిపై 19శాతం తగ్గింపును అందిస్తోంది, ఆ తర్వాత మీరు దీన్ని కేవలం రూ. 24,290 ధరతో కొనుగోలు చేయవచ్చు.

మీరు రూ. 20 వేల నుండి రూ. 25 వేల మధ్య ధృడమైన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ తర్వాత కూడా మీరు ఇతర ఆఫర్లలో అదనపు పొదుపు చేయచ్చు. అమెజాన్ దీనిపై రూ.728 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అమెజాన్ కస్టమర్లకు రూ.2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. మీరు EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు నెలవారీ రూ.1,093 మాత్రమే చెల్లించాలి.

Realme 14 Pro Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో అందించారు. 12GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం 50+2 మెగాపిక్సెల్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 6000mAh బ్యాటరీ చూడొచ్చు.