Home / WHO
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ వ్యాప్తి, చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోట్ విడుదల చేసింది.
చైనాలో పాఠశాల విద్యార్దుల్లో పెరుగుతున్న న్యుమోనియా కేసులు ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీజింగ్, లియానింగ్‌లోని పీడియాట్రిక్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో దీనిపై వివరణాత్మక సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్ వో ) చైనా ప్రభుత్వాన్ని కోరింది.
భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.
ఉప్పులేనిదే మనం ఏ వంటనూ వండలేము తినలేము. అలాంటి ఉప్పు కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. అయితే రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. కొందరైతే ఉప్పు ఎక్కువగా వేసుకుని మరీ తింటుంటారు. ఇలా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్‌కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.
ఈ ఏడాది యూరప్‌లో జూన్ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
యూరప్‌లో మరోమారు కరోనా -19 పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెంన్షన్ కంట్రోల్ తమ పౌరులను హెచ్చరించింది.
దగ్గు, జలుబు సిరప్‌ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
భారత్‌లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్ డాలర్లను పంపించారు. భారత్ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.