Home / Telangana
Telangana Legislative Council Session 2024: తెలంగాణ శాసనమండలిలో శనివారం మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణకు […]
Telangana Govt Extends Deadline for Kaleshwaram commission: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం శనివారం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలలపాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి పనిలో.. కాళేశ్వరం కమిషన్ కి జస్టిస్ పీసీ […]
Another earthquake hits Telangana at Mahaboobnagar: తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా భూమి కంపించినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు […]
Professor Ghanta Chakrapani Appointed as BRAOU VC: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. ఈ పదవిలో చక్రపాణి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. […]
Honour Killing in Telangana: తెలంగాణలో పరువు హత్య కలకలం రేగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ను ఆమె సోదరుడే అతి కిరాతంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆమెను కారుతో ఢీకొట్టాడు. తర్వాత కిందపడిన వెంటనే కత్తితో నరికి చంపాడు. అయితే, రాయపోల్ ప్రాంతానికి చెందిన […]
Telangana Panchayat Election Notification Schedule: పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. జనవరి 14న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉన్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని […]
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]
Deputy CM Bhatti Vikramarka Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే అని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా ప్రతినిధులో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై […]
Samagra Kutumba Survey In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో దాదాపు 85వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా.. వీరు 10శాతం కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వే […]
మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని... అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ... కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.