Home / Telangana
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో.. రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
తెలంగాణ సాధించిన నేతగా చరిత్రలో తన కంటూ స్దానం సాధించిన కేసీఆర్ రెండు సార్లు ప్రత్యేక తెలంగాణకు సీఎంగా వ్యవహరించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో, సంక్షేమ పధకాల అమలుతో 2018లో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కు 2023 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనివెనుక కారణాలేమిటన్న దానిపై ప్రైమ్ 9 ఎనాలిసిస్..
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం సాయంత్రం 7 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.అత్యధికంగా జనగాంలో 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, నక్రేకల్‌లో 82.34 శాతం, భోంగిర్లో 81 శాతం, పాలకుర్తిలో 81 శాతం, జహీరాబాద్‌లో 79.8 శాతం, నర్సాపూర్ (78.89 శాతం), డోర్నకల్ (79.32 శాతం), వైరా (79.20 శాతం) పోలింగ్ నమోదయింది.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఏపీ, తెలంగాణలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు.
నీట్ కౌన్సిలింగ్ తెలంగాణలో ప్రారంభమవుతున్న నేపధ్యంలో చాలామంది విద్యార్దులు తమకు సీటు వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే గతంలో కంటే మెడికల్ సీట్లు పెరిగినందున కంగారు పడనవసరం లేదని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. మెదటి, రెండు, మాప్ అప్ రౌండ్లు అయ్యాక కూడా గత ఏడాది పలు ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరి సీట్లు మిగిలిపోయాయని అయన చెబుుతన్నారు.
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా దశాబ్ధి ఉత్పవాలను రాష్ట ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. ప్రత్యేక కార్యక్రమాలతో రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.