Home / Telangana
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]
Deputy CM Bhatti Vikramarka Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే అని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా ప్రతినిధులో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై […]
Samagra Kutumba Survey In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో దాదాపు 85వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా.. వీరు 10శాతం కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వే […]
మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని... అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ... కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
జంట నగరాల ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
Former MP Undavalli Comments: ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచిన సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ రాజకీయ వేత్త ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థితి మాత్రం దశాబ్ది ఘోష అన్నట్లు తయారయ్యిందని వ్యాఖ్యానించారు . 2014 నుండి 2024 వరకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ఇప్పటి జగన్, […]
తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంచార్జ్ వీసీలుగా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిషోర్..జేఎన్టీయూకి బుర్రా వెంకటేశం, కాకతీయకు కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వి, తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి సీనియర్ ఐఏఎస్ నదీం అహ్మద్ ను ఇంచార్జ్ వీసీగా నియమించింది.