Home / Telangana
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ దిగనుంది. ఆ పార్టీ అభ్యర్ధిగా జక్కలి ఐలయ్య యాదవ్ పోటీ పోటీ చేయనున్నారు. రేపటిదినం టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నర్సులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. ఓ హెడ్ నర్సు, టెక్సియన్ మద్య చోటు చేసుకొన్న ఘటన కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక..గాలికి చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు అంటుకున్నాయి.ఆ క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి.చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో బయటకు రాలేకపోయిన రైతు భూమన్న అక్కడిడక్కడే కాలి బూడిదైపోయాడు.