Home / TDP
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. తెదేపా పాలనలో నిర్మించిన వేలాది ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే అంటూ.. చాలెంజ్ విసిరారు.
Chandrababu: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెదేపా 41న ఆవిర్భావ సభకు హాజరై.. ప్రసంగించారు.
Balakrishna: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందూపురం ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు.
గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పోతే.. కొడతారా?.. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ఈ ఘటనలో తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
Chandrababu Naidu: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Chandrababu: వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.