Home / TDP
TDP Focus On Kurnool Mayor Seat: కర్నూలు నగర మేయర్‌ని పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలను ఏకపక్షం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఎన్నికైన మేయర్ తన పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారని టీడీపీ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతున్నారు.. దాంతో […]
Chandrababu : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు […]
AP Deputy Speaker : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ‘ఏమంటివి.. ఏమంటివి?’ అంటూ దారవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని […]
CM Chandrababu : పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్యాగాలు తెలిసేలా.. మొన్న ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుపుకున్నామని సీఎం గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు […]
AP CM Chandrababu : విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1988లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌గా విభజించి, ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. విద్యుత్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేశామన్నారు. ఆ రోజు తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషపడ్డామన్నారు. వ్యవసాయానికి […]
Nara Lokesh : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించిందని, తిరిగి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా […]
CM Chandrababu : కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు […]
AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతోపాటు జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అమిత్ షాతో సమావేశమై వివిధ అంశాలపై గంటపాటు చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కలిశారు. చంద్రబాబుతోపాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిర్మలమ్మను కలిసి ఏపీ […]
GV Reddy Resign AP Fibernet Chairman: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పదవితో బాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర విమర్శలు.. ఫైబర్ నెట్లో వైసీపీ అక్రమంగా నియమించినఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం కీలక అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. […]
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]