Home / Rajasthan
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్‌లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.
బీజేపీ అధిష్టానం రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మని అధికారికంగా ప్రకటించింది. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరు తెరమీదకు వచ్చింది. బీదియా కుమారి మరియు ప్రేమ్‌చంద్ బైర్వా లను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన మరియు ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్‌లో తమ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణిసేన డిమాండ్ చేసింది.సత్వర చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని మద్దతుదారులు హెచ్చరించారు.
రాజస్థాన్‌లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, యువతులకు ఉచిత విద్య, 3,500 నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం తదితర హామీలిచ్చిన ఆ పార్టీ వాటి అమలులో చేతులెత్తేసింది.
సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ కేసులు నమోదయి వ్యక్తులను విచారణకు పిలవడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈడీ అధికారులే లంచం తీసుకున్నారంటే వ్యవస్ద ఎలా ఉందో తెలుస్తుోంది. లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక భూవివాదంలో ఒక వ్యక్తి తన సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. ఈ ఘటనలో అతను ట్రాక్టర్‌ను ఎనిమిది సార్లు ముందుకు వెనుకకు నడిపడంతో అతని సోదరుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరియు అత్తమామలు కొట్టి, వివస్త్రను చేసి ఊరేగించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లో అత్యాచార నిందితులు మరియు హిస్టరీ షీటర్లకు కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం ప్రకటించారు.వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు ప్రయత్నించడం మరియు లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులు, అలాగే హిస్టరీ షీటర్లను ప్రభుత్వ ఉద్యోగాల నుండి నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అశోక్ గెహ్లాట్ హిందీలో ట్వీట్ చేశారు.