Last Updated:

Rajasthan: షాకింగ్ .. రాజస్థాన్‌లో భార్యపై దాడిచేసి వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరియు అత్తమామలు కొట్టి, వివస్త్రను చేసి ఊరేగించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Rajasthan: షాకింగ్ ..  రాజస్థాన్‌లో భార్యపై దాడిచేసి వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

Rajasthan: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరియు అత్తమామలు కొట్టి, వివస్త్రను చేసి ఊరేగించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ధరియావద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడా గ్రామపంచాయతీలోని నిచ్చల్‌కోట గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది.గత ఏడాది పెళ్లయిన యువతి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, గ్రామంలోని మరో వ్యక్తితో కలిసి జీవించడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. మహిళ యొక్క అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసివారి గ్రామానికి తీసుకువెళ్లారు. అనంతరం ఆమెను భర్త కొట్టాడని బట్టలు విప్పి గ్రామంలో కిలోమీటరు మేర ఊరేగించాడని డీజీపీ తెలిపారు.

తొమ్మిది మంది అరెస్టు..(Rajasthan)

ఈ సంఘటనకు సంబంధించి 13 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ముగ్గురు ప్రధాన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా కాళ్లు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి మహిళను బట్టలు విప్పుతున్న దృశ్యాన్ని ఇతర పురుషులు తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది.ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నదని, ఏడీజీ దినేష్‌ను ప్రతాప్‌గఢ్‌కు పంపామని డీజీపీ మిశ్రా జైపూర్‌లో తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతాప్‌గఢ్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అమిత్‌ కుమార్‌ గ్రామంలో క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలిపారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్నిందితులు మరియు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.