Home / Rajasthan
కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు సుమారు 21 లక్షల రూపాయల విలువైన టమోటాలను తరలిస్తున్న ట్రక్కు అదృశ్యమైనట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. కోలార్‌కు చెందిన మెహత్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంలోని ట్రక్ జూలై 27న బయలుదేరింది. కాని ఇప్పటివరకు చేరుకోలేదు.
రాజస్దాన్ మంత్రివర్గం నుంచి తొలగించబడిన మంత్రి రాజేంద్ర సింగ్ గూడా సోమవారం రాజస్థాన్ అసెంబ్లీ లో 'రెడ్ డైరీ'తో కలకలం సృష్టించారు.అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 నుండి 500 కోట్ల వరకు చేసిన అక్రమ లావాదేవీల రికార్డులు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ దాడుల్లో ఉన్న మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ప్రాంగణంలో ఉన్న 'రెడ్ డైరీ'ని వెలికితీసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పలుమార్లు సంప్రదించారని గుధా సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బీజేపీ నేత కృపాల్‌సింగ్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినా పోలీసుల అదుపులో ఉండగా కాల్చి చంపబడ్డాడు.ఘటన జరిగినప్పుడు పోలీసులు జాఘినాను జైలు నుంచి భరత్పూర్ కోర్టుకు తీసుకెళ్తున్నారు. అమోలి టోల్‌ప్లాజా సమీపంలోని జాగిన వద్ద దుండగులు పోలీసులపై కారంపొడి విసిరి పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్‌పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్, జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా జూన్ 2, 3 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ సెర్మనీ నిర్వహించారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ర్యాలీలో ప్రసంగించే ముందు ఆయన పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయంలో పూజలు చేసి ఘాట్లను సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ వర్గాలకతీతంగా ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఇద్దరూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అంగీకరించినట్లు వేణుగోపాల్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్‌లో రూ.5,500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
MiG 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 12) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జైపూర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది.