Home / Political News
రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తులం బంగారం ఇస్తామని కొందరు, 40వేలు క్యాష్ ఇస్తామంటూ మరికొందరు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందంతా అఫీషియల్ కాదండోయ్ అంతా తెరచాటు రాజకీయమే. ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.
హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ భేటీలో తాజా రాజకీయాల పై చర్చించినట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య కాక రేపుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలు కూడా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నాయి.
సీఎం కేసిఆర్ తాంత్రికుడి మాటలు విని నాలుగేళ్లు మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఆరోపించారు. 2014 నుండి 2018 వరకు ఆయన మంత్రివర్గంలో మహిళలు లేరంటూ గుర్తుచేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా మధనం జరుగుతోందట. అసలు ఏంటి మన పరిస్థితి అని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కిన మంత్రులు చాలా మంది అనుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్‌కు నేనున్నా అంటూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో కలకలం రేగింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని భావిస్తోన్న వైసీపీ అధినేత జగన్‌కు ఈ పరిణామం మింగుడు పడడం లేదని అంటున్నారు.
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
AP : ఏపీలో వైరల్ గా మారిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
సీఎం కేసిఆర్ ను దేశ్ కీ నేతగా ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటే...సీఎం కేసిఆర్ బంగారు తెలంగాణాను దరిద్ర తెలంగాణాగా మారుస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు