Last Updated:

KA Paul: భాగ్యనగరంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దరిద్ర తెలంగాణగా పేర్కొన్న కేఏ పాల్

సీఎం కేసిఆర్ ను దేశ్ కీ నేతగా ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటే...సీఎం కేసిఆర్ బంగారు తెలంగాణాను దరిద్ర తెలంగాణాగా మారుస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు

KA Paul: భాగ్యనగరంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దరిద్ర తెలంగాణగా పేర్కొన్న కేఏ పాల్

Hyderabad: సీఎం కేసిఆర్ ను దేశ్ కీ నేతగా ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటే, సీఎం కేసిఆర్ బంగారు తెలంగాణాను దరిద్ర తెలంగాణాగా మారుస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకు తగ్గ ఆధారాలను నేరుగా చూపించారు. హైదరాబాదు నగరంలోని హైకోర్టు మార్గంలో రోడ్డు పై ఉన్న చెత్తచెదారాలతోనా మనం బంగారు తెలంగాణా సాధించేది అంటూ చురకలంటించారు. ఇంత దరిద్రంగా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారు కాబట్టే, జాతీయ గ్రీన్ ట్రబ్యునల్ రూ. 3800కోట్లు జరిమానా విధించిందని తప్పు బట్టారు.

ఇదేనా తెలంగాణా రాష్ట్రాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి అంటూ మీడియా ముఖంగా కేసిఆర్ ను నిలదీశారు. నగరంలో ప్రధాన రహదారులు కంపు కొడుతున్నాయని పేర్కొన్నారు. గ్రీనరి కాదు కదా. ఎక్కడ చూసిన దరిద్రం ఉట్టి పడుతుందని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి:  పాలపిట్ట తెచ్చిన తంట.. వివాదంలో సీఎం కేసిఆర్

 

ఇవి కూడా చదవండి: