Minister KTR: బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మాలా ఉంది.. మంత్రి కేటీఆర్
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
Hyderabad: మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 10వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని చెప్పారు. బీజేపీ మల్టీ ఫేసెడ్ పార్టీ అని, బీజేపీ నేషనల్ పార్టీ అయినా నడిపించేది మాత్రం గుజరాతీలేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే దేశ ప్రజలకు తెలుసునని, తమ ఫోకస్ 2024 లోకసభ ఎన్నికలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే స్థితిలో వుందని, తమకు టైం, సమయం ఇవ్వాలని మంత్రి కోరారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామని, గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ శుద్ధమైన త్రాగు నీరు, దళిత బంధు వంటి కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల పైన ఉన్న కేసులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మా లాగానే ఉందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.
2022 వరకు అందరికీ ఇండ్లు ఇస్తామని మోదీ చెప్పారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. మోదీ మాత్రం రూ. 435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారని కేటీఆర్ వెల్లడించారు. నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయి. జన్ కీ బాత్ వినరు. మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని ఎద్దెవా చేశారు. సాగు దండగ కాదు. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని నిరూపించారని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించామని చెప్పారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ చూసి ఎనిమిదేండ్లలో ఏం చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎండగట్టడమే తమ వ్యూహం. దివాళా కోరు, పనికి రాని ప్రధాని మోదీ అని కేటీఆర్ విమర్శించారు.